బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్
పెద్దవంగర, ఆంధ్రప్రభ : పెద్దవంగర తహసీల్దార్ గా బలభద్ర వినోద్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్ఐ భూక్యా లష్కర్, రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా తహసీల్దార్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. మండల రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా మెరుగైన సేవలను, సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
