POCSO Case | గాలింపులో ఐదు ప్రత్యేక బృందాలు

POCSO Case | గాలింపులో ఐదు ప్రత్యేక బృందాలు

POCSO Case | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆయనపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

భగీరథ్ ఆచూకీ కోసం ఐదు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అతను ఎక్కడ ఉన్నాడనే దానిపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లోని బండి సంజయ్ నివాసంలో సైబరాబాద్ పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లో పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

భగీరథ్‌తో టచ్‌లో ఉన్న వ్యక్తులపై కూడా పోలీసులు నిఘా ఉంచినట్లు సమాచారం. అతని స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

Leave a Reply