24వ డివిజన్ గిరిపురంలో ఇంటింటికీ టీడీపీ
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ సెంట్రల్, ఆంధ్రప్రభ : స్థానిక 24వ డివిజన్ గిరిపురంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ‘ఇంటింటికీ ప్రచారం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గిరిపురం ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను కూటమి ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఇంటిపై పూర్తి హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఇజ్జడ దుర్గారావు, గుడ్డేటి మురళి, గాజుల బ్రదర్స్, గడ్డం రాజు, అంకాలు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
