కోదండ రామాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం
కోదండ రామాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం
ఘంటసాల – ఆంధ్రప్రభ : ఘంటసాల మండలం పూషడంలో కోదండ రామాలయ పునర్నిర్మాణం చేపట్టారు. శనివారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ (Mandali Buddhaprasad) విచ్చేసి శంకుస్థాపన పూజలు చేశారు. తుమ్మల నందీశ్వరరావు – సత్యవాణి దంపతులు, భీమా వెంకటేశ్వరరావు – సత్యవాణి దంపతులు శంకుస్థాపన పూజలు చేశారు. వేద పండితులు అతిథులను వేద ఆశీర్వచనం అందించగా, కమిటీ పెద్దలు సత్కరించారు.
ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల విరాళాలు రూ.40 లక్షల అంచనాతో ఈ ఆలయ పునర్ నిర్మాణం చేయనున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, టీడీపీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరిబాబు, డీసీ వైస్ చైర్మన్ పరిశే చలపతిరావు, సర్పంచ్ అంకం మారుతీరావు, ఈమన బాలయ్య, అంకం రాంబాబు, కఠారి ఆది, గల్లా జోలయ్య పాల్గొన్నారు.
