సంక్షేమాన్ని అందించేది టీడీపీనే..

ఇంటింటికీ తెలుగుదేశం..
సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన
తూర్పు నియోజకవర్గంలో గన్నే ప్రసాద్ (అన్నా) విస్తృత ప్రచారం


(విజయవాడ, ఆంధ్రప్రభ) : రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గురువారం ఉత్సాహంగా సాగింది. గుణదల పడవలరేవు ప్రాంతంలోని 2వ డివిజన్‌లోని 22, 23, 24 బూత్‌ల పరిధిలో డివిజన్ అధ్యక్షుడు దాసరి గాబ్రియేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు గన్నే ప్రసాద్ (అన్నా) పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లిన గన్నే ప్రసాద్ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ సేవలు ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ కార్యకర్తలు ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి సుగసాని కృష్ణప్రసాద్, రత్నశ్రీతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.