ప్రహ్లాదపురంలో దారుణం

వృద్ధురాలిని హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు

విశాఖపట్నం బ్యూరో, (ఆంధ్రప్రభ): పెందుర్తి పరిధిలోని ప్రహ్లాదపురంలో అర్ధరాత్రి సమయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న కర్రీ పైడమ్మ (72) అనే వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసి, ఆమె ధరించిన బంగారు ఆభరణాలను అపహరించి పరారయ్యారు.

ఉదయం ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 112కు సమాచారం అందించారు. దీంతో పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు కొనసాగిస్తున్నారు.