బాధిత కుటుంబానికి రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చెందిన మెంగని నరసయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.60 వేల ఆర్థిక సాయం మంజూరైంది.

ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు ఆదేశాల మేరకు శనివారం ఉడుంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మంజూరైన రూ.60 వేల చెక్కును నరసయ్య భార్య లక్ష్మవ్వకు గ్రామ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్తా, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి అందజేశారు.

ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సాయం బాధిత కుటుంబానికి కొంత మేర ఊరటనిస్తుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉడుంపూర్ గ్రామపంచాయతీ మొదటి వార్డు సభ్యుడు అజ్మీర రవీందర్, కాంగ్రెస్ నాయకులు బెడద సత్తయ్య, జి. శ్రీనివాస్, దొంతుల శ్రీనివాస్, పున్నం నాయక్, ఈజీఎస్ ఎఫ్‌ఏలు బి. సత్తయ్య, నాగవత్ రవీందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.