చెక్ బౌన్స్ కేసులకు లోక్ అదాలత్ లో పరిష్కారం

నవంబర్ 21న మరో స్పెషల్ లోక్ అదాలత్..
వినియోగించుకోవాలని న్యాయమూర్తి సూచన

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : చెక్ బౌన్స్‌కు సంబంధించిన ఎన్‌.ఐ. యాక్ట్ కేసులను పరస్పర రాజీ ద్వారా త్వరగా పరిష్కరించు కునేందుకు స్పెషల్ లోక్ అదాలత్‌ను వినియోగించు కోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్, ప్రధాన జిల్లా న్యాయమూర్తి జే. జీవన్ కుమార్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకులు, చిట్‌ఫండ్ సంస్థల లావాదేవీలకు సంబంధించిన ఎన్‌.ఐ. యాక్ట్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు లోక్ అదాలత్ సమర్థవంతమైన వేదిక అని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల కక్షిదారులు, బ్యాంకు మేనేజర్లు, చిట్‌ఫండ్ కంపెనీల ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నవంబర్ 21న మరోసారి స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల, ప్రభుత్వ న్యాయవాది బోట్ల సుధాకర్, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. సురేష్ కుమార్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఐ. శివకుమార్, న్యాయవాదులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.