Surrender | 28 మంది మావోయిస్టుల లొంగుబాటు
Surrender | 28 మంది మావోయిస్టుల లొంగుబాటు
- ఇందులో 19 మంది మహిళలు
- రూ.86 లక్షల రివార్డు
ఆంధ్రప్రభ, చింతూరు (ఏఎస్ఆర్ జిల్లా) : మావోయిస్టు రహిత దండకారణ్యం దిశలో చత్తీస్ గడ్ బలగాలు ఫలితాలను సాధిస్తున్నాయి. . ప్రభుత్వం చేపట్టిన పునరావాసం నుంచి పునరుజ్జీవనం కార్యక్రమానికి మావోయిస్టులు బయలుదేరుతున్నారు. నారాయణ్‌పూర్ జిల్లాలో మంగళవారం 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 19 మంది మహిళ మావోయిస్టులు ఉన్నారు. 28 మందికి మొత్తం రూ. 89 లక్షల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు.
హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నారని నారాయణ్‌పూర్ ఎస్పీ రాబిన్సన్ గుడియా తెలిపారు.. లొంగిపోయిన మావోయిస్టుల్లో మాద్ డివిజన్ డీవీసీఎం, పీఎల్‌జీఏ కంపెనీ నెం. 06 మిలిటరీ సభ్యుడు, ఏరియా కమిటీ సభ్యుడు, టెక్నికల్ టీమ్ సభ్యుడు, మిలిటరీ ప్లాటూన్ సభ్యులు, సప్లై టీమ్ సభ్యులు ఉన్నారు. ఒక ఎస్ఎల్‌ఆర్, ఒక ఇన్సాస్, ఒక .303 రైఫిల్‌తో సహా ఆయుధాలను భద్రతా దళాలకు అప్పగించారు.
