BJP MP | ఔటర్ రింగ్ రోడ్ హామీ మరిచారు…

BJP MP | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను రాజకీయంగా అణగదొక్కేందుకే నిజామాబాద్ జిల్లాకు మొండిచేయి చూపిస్తున్నారని అరవింద్ విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్ హామీ ఇచ్చి మరిచిపోయారని మండిపడ్డారు. ఇందూరు ప్రజలను మోసం చేస్తే వారు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగరంలోని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తికావని అరవింద్ పేర్కొన్నారు. రూ.162 కోట్ల ప్రాజెక్టుకు కేవలం రూ.10 కోట్ల నిధులే విడుదల చేశారని విమర్శించారు. అలాగే రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరో పదేళ్లు దేశంలో బీజేపీ అధికారంలో ఉంటుందని ఆయనే ఒప్పుకున్నట్లైందన్నారు. కోమటిరెడ్డి వంటి నిజాయితీ గల నాయకుడిని సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు.

Leave a Reply