జనాభా గణనను పరిశీలించిన సూపర్ వైజర్..
కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఎలగడప గ్రామంలో జరుగుతున్న జనాభా గణన ప్రక్రియను జనాభా గణన సూపర్‌వైజర్ బాలాజీ మంగళవారం పరిశీలించారు. ఎలగడప గ్రామపంచాయతీ పరిధిలోని పలు వార్డులను సందర్శించిన ఆయన, ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.
జనాభా గణనలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామాల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో జనాభా గణన కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ప్రజలు కూడా ఎన్యుమరేటర్లకు సహకరించి సరైన సమాచారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనాభా గణన ఎన్యుమరేటర్ కూచనపల్లి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి బి. నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
