kadem కడుపునొప్పి తాళలేక వృద్ధురాలి బలవన్మరణం

kadem కడుపునొప్పి తాళలేక వృద్ధురాలి బలవన్మరణం

  • అనారోగ్య బాధతో చీరతో ఉరేసుకున్న 80 ఏళ్ల మహిళ
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కడెం(kadem), ఆంధ్రప్రభ:

మండలంలోని అంబారిపేట్ గ్రామానికి చెందిన అల్లంల బుచ్చి మల్లవ్వ (80) మంగళవారం తన ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు కడెం పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఏఎస్ఐ మాన్‌సింగ్ తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, బుచ్చి మల్లవ్వ గత కొన్ని నెలలుగా కడుపులో అల్సర్ పుండ్ల సమస్యతో తీవ్రంగా బాధపడుతోంది. చికిత్స కోసం పలు ఆసుపత్రులు తిరిగినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రోజురోజుకూ కడుపునొప్పి తీవ్రత పెరగడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె, మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చీరతో ఇంటి తలుపుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏఎస్ఐ మాన్‌సింగ్ తెలిపారు.ఈ ఘటనతో అంబారిపేట్ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

Leave a Reply