టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం

ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉదార విరాళం
అదనపు ఈవో వెంకయ్య చౌదరికి డీడీలు అందజేసిన దాతలు

తిరుమల (ఆంధ్రప్రభ): తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.2 కోట్ల విరాళాన్ని బుధవారం అందించింది. సంస్థ తరఫున ఆర్. సీతారామ్ రెడ్డి, జి. కవిత, త్రినయ్ రెడ్డి, త్రిభువన్ రెడ్డి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు.

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు ద్వారా పేద రోగులకు వైద్యసేవలు అందించేందుకు ఈ విరాళం వినియోగించనున్నారు. ఈ సందర్భంగా దాతల సేవాభావాన్ని టీటీడీ అధికారులు అభినందిస్తూ, ట్రస్టు కార్యక్రమాలకు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.