Major Accident | ఇద్దరు సజీవ దహనం

Major Accident | ఇద్దరు సజీవ దహనం

Major Accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమలాయపాలెం మండల పరిధిలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ప్రమాదం అనంతరం బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమైనట్లు సమాచారం.

ఇవాళ ఉదయం వైజాగ్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న బొగ్గు లారీ, మర్రిపేడ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న మరో లారీ మేకల తండా స్టేజి సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే బొగ్గు లోడ్ లారీలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ డ్రైవర్ జేమ్స్‌తో పాటు మరో వ్యక్తి మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply