రామప్పలో సండే సందడి…
వెంకటాపూర్,ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వెంకటాపూర్(Venkatapur) మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని, తమ మొక్కులు చెల్లించుకున్నారు.
రామలింగేశ్వరస్వామి(Ramalingeswara Swamy) వారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ లు ఆలయానికి విచ్చేసిన భక్తుల గోత్ర నామాలతో పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు(blessings) వారికి అందజేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వాహణాధికారి బిల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లను చేశారు.

