కొలనుపాకలో వేసవినృత్య శిక్షణా శిబిరం ప్రారంభం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక ప్రతిభ స్కూల్ లో వేణు డాన్స్ అకాడమీ నిర్వహణలో విద్యార్థుల కోసం వేసవి నృత్య శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు నృత్య శిక్షణ ద్వారా నైపుణ్య సాధనతో పాటు ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ బెదర బోయిన యాకమ్మ, యువ నాయకులు భీమగాని సంతోష్ గౌడ్, సీనియర్ విద్యావేత్త, ట్రస్మా జిల్లా బాధ్యులు గాదె సోమిరెడ్డి, నృత్య శిక్షకులు సంగి వేణు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.