కౌడిపల్లి, ఆంధ్రప్రభ చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సదాశి పల్లి గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది వివరాల్లోకెళ్తే గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సదాశి పల్లి గ్రామానికి చెందిన చాకలి కృష్ణ మంగళవారం రాత్రి 7 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కృష్ణ కోసం గాలింపు చేయగా గ్రామంలోని కనికల చెరువు ఒడ్డున కృష్ణ దుస్తులు లభ్యమయ్యాయి
నేటి ఉదయం కృష్ణ చెరువులో శవంగా తేలాడు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో కృష్ణ శవాన్ని చెరువులో నుండి తీశారు మృతుడు కృష్ణకు భార్య శోభ ఇద్దరు కూతుర్లు అనుప్రియ విష్ణుప్రియ ఉన్నారు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది ఈ మేరకు కౌడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు