తిరుపతిలో ఆకస్మిక కార్డన్ అండ్ సెర్చ్

తిరుపతి, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో ఆకస్మిక కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈస్ట్, వెస్ట్, ఆలిపిరి, తిరుపతి రూరల్, వడమాలపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేసి, అనుమానిత వ్యక్తులను పరిశీలించారు.

రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడం, నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలను పరిరక్షించడం లక్ష్యంగానే ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

Leave a Reply