ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలి

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలి

తిరుపతి, ఆంధ్రప్రభ: తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ (ఎఫ్.ఏ.సి) శారదా దేవి ఒక ప్రకటనలో కోరారు. జూన్ 1వ తేదీ (సోమవారం) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో నేరుగా అర్జీల స్వీకరణ ఉంటుందని ఆమె తెలిపారు. అలాగే, ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. నగర ప్రజలు తమ సమస్యలను ఫోన్ ద్వారా నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడానికి 0877-2227208 నంబర్‌కు కాల్ చేయవచ్చని సూచించారు. కార్యాలయానికి నేరుగా వచ్చే అర్జీదారులు తమ వినతిపత్రంతో పాటు గుర్తింపు కార్డు ప్రతిని (ID Proof) తప్పనిసరిగా జత చేయాలని, అలాగే సంప్రదింపుల కోసం పనిచేస్తున్న ఫోన్ నంబర్‌ను అందులో పొందుపరచాలని కమిషనర్ శారదా దేవి స్పష్టం చేశారు.