7:00 PM | భక్తుల కోర్కెలు తీర్చే దివ్య సందేశం

7:00 PM | భక్తుల కోర్కెలు తీర్చే దివ్య సందేశం

రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు

మనోరథాలను నెరవేర్చే కల్పతరువుగా అనుగ్రహం

7:00 PM | నారాయణవనం – ఆంధ్రప్రభ : నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

7:00 PM |
7:00 PM |

సకల సంపదల ప్రదాతగా, భక్తుల మనోరథాలను నెరవేర్చే కల్పతరువుగా స్వామివారు దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన భక్తులు భక్తి పరవశంలో మునిగిపోయారు.

వాహనసేవ సందర్భంగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు నిర్వహిస్తూ గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. మంగళవాయిద్యాల నడుమ సాగిన వాహనసేవలో భక్తులు మార్గమధ్యంలో అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

పురాణాల ప్రకారం కల్పవృక్షం కోరిన కోర్కెలన్నింటినీ నెరవేర్చే దైవస్వరూపంగా భావిస్తారు. ఆ దైవ సందేశాన్ని భక్తులకు చాటిచెప్పేలా స్వామివారు కల్పవృక్ష వాహనంపై విహరించడం విశేషంగా నిలిచింది.

ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సర్వభూపాల వాహనసేవను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, చెంగల్‌రాయులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, శ్రీవారి సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Leave a Reply