సబ్సిడీ జీలుగు విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

సబ్సిడీ జీలుగు విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

  • ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగేల భూషణ్

కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందిస్తున్న జీలుగు విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పడిగేల భూషణ్, పాండవపూర్ పీఏసీఎస్ చైర్మన్ రామడుగు శైలజ–రమేష్‌రావు కోరారు.

గురువారం మండల కేంద్రం కడెంలోని పాండవపూర్ పీఏసీఎస్ కార్యాలయంలో సబ్సిడీ జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు పచ్చిరొట్ట ఎరువుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను వినియోగించుకోవాలని సూచించారు. విత్తనాల పంపిణీ ఆన్‌లైన్ విధానంలో జరుగుతోందని తెలిపారు.

30 కిలోల జీలుగు విత్తనాల బస్తా పూర్తి ధర రూ.4,905 కాగా, ప్రభుత్వ సబ్సిడీ రూ.2,452 అందించబడుతుందని చెప్పారు. రైతులు కేవలం రూ.2,452 మాత్రమే చెల్లించి విత్తనాలను పొందవచ్చని వివరించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పెద్దూర్, కడెం గ్రామాల సర్పంచ్ దీకొండ విజయకుమార్, సంఘం డైరెక్టర్ కర్ణాటకం రాజం, ఆర్టీఏ జిల్లా సభ్యుడు తుమ్మల మల్లేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.