ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలో గురువారం ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా మార్కెటింగ్ మేనేజర్ రఘు, బ్రాంచ్ మేనేజర్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ముత్తూట్ ఫైనాన్స్ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఉచితంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ శిబిరం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం వైద్య నిపుణులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు మరియు సూచనలు అందించారు. ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ కార్యక్రమంలో ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ వెంకటేష్, మార్కెటింగ్ మేనేజర్ రఘు, సంస్థ సిబ్బంది, నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.