డిప్యూటీ తహశీల్దార్ కు వినతిపత్రం అందజేత

దండేపల్లి, ఆంధ్రప్రభ : రైతుల సమస్యలపై బిజెపి పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు బిజెపి పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షు గోపతి రాజయ్య నాయకులతో కలిసి సోమవారం దండేపల్లి డిప్యూటీ తహశీల్దార్ చుంచు మాధవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాజులుగా చేస్తానని చెప్పి ఇప్పుడు అదే రైతులనుదోసుక తింటున్నారని అన్నారు.

రైతులు అరుకాలం కష్టపడి పండించిన పంటను అప్పుడు కొనడంతో జాప్యం చేసి ఇప్పుడు తూకం వేసిన వడ్ల బస్తాలను రైస్ మిల్లుకు తరలించడానికి లారీలు పంపించకపోవడంతో రైతులు ఒకొక్క బస్తాకు 15 నుంచి20 రూపాయ చొప్పున ఇస్తామని లారీలను తీసుకవచ్చి నింపి రైస్ మిల్లుకు పంపిస్తే అక్కడ మిల్లర్లు ఒకొక్క బస్తాకు 3నుంచి4 కిలోలు కోతకొస్తున్నారని దీనితో రైతుల బాధ ఎవరికి చెప్పుకోలేక ననాఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

దీనిపై ప్రభుత్వం వెంటనె స్పందించక పోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఆయన మండిపడ్డారు.ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు స్పందించి రైతులను ఇబ్బదులకు గురిచేయకుండా రైస్ మిల్లులో వడ్లు కటింగ్ లేకుండా దించుకునేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో,బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కర్ణాల కిషన్, ఎంబడి సురేందర్, కన్నెపల్లి మాజీ ఉపసర్పంచ్ దుమ్మని సత్తయ్య, బోడ సత్యనారాయణ, మండల కార్యదర్శి కమ్మల బుచ్చన్న, పంచేర్పుల సత్యం పిట్టల అశోక్, రాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply