బీజేపీ ఘనవిజయం.. ఉట్నూర్‌లో సంబరాలు

బీజేపీ ఘనవిజయం.. ఉట్నూర్‌లో సంబరాలు
ఉట్నూర్, ఆంధ్రప్రభ: పశ్చిమ బెంగాల్‌తో పాటు మరో రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాన్ని సాధించి జయకేతనం ఎగురవేసిన సందర్భంగా ఉట్నూర్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. స్థానిక ఐబి చౌరస్తా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
బెంగాల్ ప్రజల ఆశీస్సులు మోదీకే: మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, ఖానాపూర్ మాజీ శాసనసభ్యులు సుమన్ రమేష్ రాథోడ్ పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దీవించి పార్టీని విజయపథంలో నడిపించారని పేర్కొన్నారు. బీజేపీపై నమ్మకం ఉంచిన బెంగాల్ ప్రజానీకానికి ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ విజయోత్సవ కార్యక్రమాల్లో బీజేపీ ఉట్నూర్ మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, లీగల్ అడ్వకేట్ బానోత్ జగన్ నాయక్, జిల్లా ఎస్టీ మోర్చా కార్యదర్శి రాథోడ్ శేషారావు, మాజీ జెడ్పీటీసీ సాడిగే గంగన్న పాల్గొన్నారు.
వీరితో పాటు జిల్లా కార్యదర్శి బొడ్డు కిరణ్, సీనియర్ నాయకులు కొమ్ము రామచందర్, సాడికి రాజేశ్వర్, సిపతి లింగాగౌడ్, కందుకూరి రమేష్, ఉష్కముల దేవిదాస్, నాగభూషణం, కాల్వ రవి, తన్నీరు సతీష్, బాణావత్ జితేందర్, సాన గోపి, రాథోడ్ విటల్, కాలేరి గంగాధర్, పులి శ్రీకాంత్, కొత్త సత్యనారాయణ, చింతల రమణ, ఉగ్గే విజయ్ తదితరులు పాల్గొన్నారు.
