విద్యార్థి శ్రీజా రెడ్డికి జ్యోతిబా పూలే ప్రతిభా అవార్డు 2026
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని శ్రీజా రెడ్డి విశిష్ట ప్రతిభ కనబరచింది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 560/600 మార్కులు సాధించి మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల టాపర్గా నిలిచింది. ఈ విజయాన్ని గుర్తించి ఆమెకు “జ్యోతిబా పూలే ప్రతిభా అవార్డు 2026”ను నేడు హైదరాబాద్లోని రవీంద్ర భారతి లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రముఖులు మల్లు రవి, వి. హనుమంతరావు, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హాజరై విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీజా రెడ్డి తల్లిదండ్రులు కూడా పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీజా రెడ్డి సాధించిన ఈ విజయం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేవతి మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.
