ఉచిత సంస్కృత భాషా బోధన ప్రారంభం

బెజ్జంకి, ఆంధ్రప్రభ : సంస్కృత భాషా ప్రాచుర్యానికి కృషి చేస్తున్న సంస్కృత భారతి ఆధ్వర్యంలో నేడు మండల కేంద్రంలోని విద్యా నికేతన్ పాఠశాలలో ఉచిత సంస్కృత భాషా బోధన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్కృత భారతి కార్యకర్త ఆంజనేయులు మాట్లాడుతూ సంస్కృత భాష భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మూలస్తంభమని తెలిపారు.

విద్యార్థులు సంస్కృత భాషను అభ్యసించడం ద్వారా మంచి విలువలు, జ్ఞానం పొందగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధకురాలు చంద్రకళ, ఉపాధ్యాయులు పుల్లూరు ప్రభాకర్ పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని సంస్కృత భాషను నేర్చుకునేందుకు ఆసక్తి చూపించారు. ఈ ఉచిత శిక్షణ ద్వారా స్థానికంగా సంస్కృత భాషపై అవగాహన పెరగడంతో పాటు, విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు.