ఘనంగా చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు..
ఘనంగా చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు..
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో సోమవారం తెలుగుజాతి గర్వించదగ్గ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు76వ జన్మదిన వేడుకలను మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గడ్డి కృష్ణారెడ్డి రోజా రాణి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు, మిఠాయిలు పంచి పెడుతూ కార్యకర్తలు అభిమానులు నడుమ పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విశ్వవిఖ్యాత నాయకుడు చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయన దార్శనికత, కష్టపడే తత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. బాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
నిరంతర శ్రామికుడు 76 ఏళ్ల వయసులో కూడా ఒక యువకుడిలా రోజుకు 18 గంటలు కష్టపడే తత్వం ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఆయనకు విశ్రాంతి తెలియదని, రాష్ట్ర ప్రయోజనాలే ఆయన శ్వాస అన్నారు. అభివృద్ధికి చిరునామా నాడు హైటెక్ సిటీ నిర్మించి ఐటీ విప్లవాన్ని తెచ్చి నేడు ఏపీని డిజిటల్ యుగంలో నడిపిస్తున్నా అది ఆయన విజన్ వల్లే సాధ్యమైందన్నారు. సంక్షేమం,అభివృద్ధిని రెండు కళ్లుగా భావించే గొప్ప నాయకుడని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనుభవజ్ఞుడైన నాయకుడి అవసరం ఎంత ఉందో మనం చూస్తున్నామని, పోలవరం పూర్తి చేయాలన్నా, అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నా అది కేవలం చంద్రబాబు వల్లే సాధ్యపడుతుందన్నారు.
పేదల పెన్నిధి అన్న క్యాంటీన్లు, పేదలకు పింఛన్లు, అనేక సంక్షేమ పథకాల ద్వారా సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చూడాలని తపించే గొప్ప మనసున్న మహానేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి రామ తులశమ్మ, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒంటెరు రామారావు,దూపకుంట్ల బాబురావు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ షేక్ శ్రీను, గవ్వలపల్లి శ్రీనివాసరావు, తుళ్లూరు కృష్ణ, పంబి చెన్నారావు, మల్లాది చంటి, మరీదు జమలయ్య, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.
