Vijayawada | క్రిస్మస్ వేడుకలు..

Vijayawada | క్రిస్మస్ వేడుకలు..
Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావును టీఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ తిరుపతి శ్రీనివాసరావు విజయవాడలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈనెల 25వ తేదీన సాయంత్రం 6 గంటలకు కోడూరులో నిర్వహిస్తున్న గ్రాండ్ క్రిస్మస్ (Christmas) వేడుకలకు రావలసిందిగా ఆహ్వాన కార్డును తిరుపతి శ్రీనివాసరావు పాపారావుకు అందజేశారు. ఖచ్చితంగా టీఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటానని పాపారావు తెలిపారు.
