Srikakulam | అప్పల సూర్యనారాయణకు కన్నీటి నివాళి..
Srikakulam | అప్పల సూర్యనారాయణకు కన్నీటి నివాళి..
Srikakulam, ఆంధ్రప్రభ బ్యూరో : మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందిన సమాచారం తెలుసుకొని, హుటాహుటిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పి కె.వి మహేస్వర రెడ్డి అరసవల్లి చేరుకొని అప్పల సూర్యనారాయణ పార్థివదేహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.
సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఎన్నో అభివృద్ధి ,సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం పొంది, జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేసిన ప్రజల మనిషి అప్పలసూరి నారాయణ అని ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. అప్పల సూర్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తెలిపారు.

