గీతామాధురితో కలిసి పాట పాడిన కలెక్టర్ లక్ష్మీశ..

గీతామాధురితో కలిసి పాట పాడిన కలెక్టర్ లక్ష్మీశ..

ఐజీఎంసీ స్టేడియంలో ఆకట్టుకున్న  కలెక్టర్..

ఎవర్‌గ్రీన్ పాటతో ప్రేక్షకులను అలరించిన లక్ష్మీశ..

ఆంధ్రప్రభ విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా జి లక్ష్మీ శ తన ప్రత్యేక ప్రతిభతో మరోసారి ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం లో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌లో కలెక్టర్ డా. లక్ష్మీశ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని గీత మాధురి తో కలిసి కలెక్టర్ ‘ఎన్నెన్నో జన్మల బంధం’ అనే ఎవర్‌గ్రీన్ గీతాన్ని ఆలపించారు. కలెక్టర్ స్వయంగా గొంతెత్తి పాట పాడటంతో ప్రేక్షకులు విజిల్స్, చప్పట్లతో హర్షం వ్యక్తం చేస్తూ ప్రోత్సహించారు. కలెక్టర్  లక్ష్మీ శ సంగీతాభిరుచి, వేదికపై ఆయన చూపిన ఆత్మవిశ్వాసం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Leave a Reply