మే 1న శ్రీ బాలనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం

మే 1న శ్రీ బాలనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం
- అంగరంగ వైభవంగా జాతర ఏర్పాట్లు
- ప్రత్యేక ఆకర్షణగా గరుడ ముద్ద ప్రసాద పంపిణీ
చిట్యాల, ఆంధ్రప్రభ ; నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో వెలసిన శ్రీ శ్రీ శ్రీ బాలనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం (జాతర) ఈ నెల 30 నుండి తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఏప్రిల్ 30 గురువారం మరియు మే 1 శుక్రవారం తేదీలలో ఈ వేడుకలు నిర్వహించబడతాయి.
ఏప్రిల్ 30 గురువారం సాయంత్రం 4:11 గంటలకు స్థానిక శివాలయం నుండి ఉత్సవ మూర్తుల ఊరేగింపుతో జాతర ప్రారంభమవుతుంది. మే 01 శుక్రవారం ఉదయం 6:11 గంటలకు గణపతి పూజ, స్వస్తివాచనం, మంటపారాధన జరుగుతాయి. ఉదయం 8:21 గంటలకు ఉత్సవమూర్తులకు అభిషేకం. ఉదయం 10:31 గంటలకు ఎదురుకోలు ఉత్సవం. ఉదయం 11:15 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.
ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా మే 1వ శుక్రవారం ఉదయం 11:00 గంటలకు సంతాన ప్రాప్తి కోసం భక్తులకు “గరుడ ముద్ద” ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలను నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రాఫ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు, భక్తులు పాల్గొననున్నారు.
