బంకుల వద్ద రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు…

బంకుల వద్ద రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు…

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : డీజిల్ కొరత ముఖ్యంగా రైతులను వేధిస్తోంది. మొక్కజొన్న, వరికోతలు ముమ్మరంగా ఉండటంతో వాటిని కోసే యంత్రాలకు, ధాన్యం, మొక్కజొన్న రవాణాకు ట్రాక్టర్లుకు డీజిల్ అత్యవసరంగా ఉంది. అయితే బంకుల్లో డీజిల్ నిల్వలు లేవని, ఉన్నా రేషన్ ప్రకారం ఇస్తామని బంకు నిర్వాహకులు అనటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.

రైతుల ఆందోళన దృష్ట్యా మంగళవారం గ్రామంలోని కెడీసీసీ బ్యాంక్ అధ్వర్యంలో నిర్వహించే బంకులో రెవిన్యూ, వ్యవసాయ శాఖ సూచించిన రైతులకు క్యాన్లో డీజిల్ అందజేశారు. ట్రాక్టర్లు, కార్లకు. ఒక్కో రైతులకు రూ.1000 ల డీజిల్ అందజేశారు. ఈకార్యక్రమంలో హలీమ్, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply