రాష్ట్ర అభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేస్తాం: గొట్టిపాటి
- ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవికుమార్
- ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరణ
అద్దంకి, ఆంధ్రప్రభ: ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
అద్దంకి మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల విశ్వాసమే తమ బలమని పేర్కొన్న గొట్టిపాటి రవికుమార్, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు అంకితభావంతో పనిచేస్తామని అన్నారు. ప్రజల సహకారంతో గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
