మంగళ్‌పాడ్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం
సుమారు 300 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ
ఎడపల్లి, ఆంధ్రప్రభ: ఎడపల్లి మండలంలోని మంగళ్‌పాడ్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్‌పల్లి, ఎడపల్లి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సుమారు 300 మందికి బీపీ, షుగర్, ఈసీజీ, కంటి తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి వైద్యుల సూచనల మేరకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్‌పల్లి అధ్యక్షుడు దుర్గారావు, కార్యదర్శి రమణారెడ్డి, శ్రీనివాసరాజు, గాంధీ, చక్రవర్తి పాల్గొన్నారు.
అలాగే ఎడపల్లి లయన్స్ క్లబ్ సభ్యులు గంగారెడ్డి, ప్రకాష్, మెర్సీ, పుష్పలత, కార్యదర్శి అరుణ్‌కుమార్ గౌడ్, అధ్యక్షుడు రాకేష్ వర్మ హాజరయ్యారు.
కార్యక్రమానికి ప్రోగ్రామ్ చైర్మన్‌గా సూర్యనారాయణ, కో-చైర్మన్‌లుగా చక్రవర్తి వ్యవహరించారు.

