అతివేగంతో అదుపుతప్పిన కారు…

అతివేగంతో అదుపుతప్పిన కారు…

  • బైక్ ని ఢీకొన్న మరో బైక్
  • వేర్వేరుగా ప్రమాదాల్లో 7 గురికి గాయాలు

మోత్కూరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామ శివారులో వలిగొండ- తొర్రూరు ప్రధాన రహదారిపై (930 పి హైవే)మంగళవారం వరుసగా రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో మొత్తం 7 మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున తొర్రూరు నుండి హైదరాబాద్‌కు వెళుతున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.

ఈ ఘటనలో హయత్‌నగర్‌కు చెందిన (టీజీ 11 టీ 5450) కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అదే ప్రాంతంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా వెళుతున్న బైక్ ను మరో బైక్ వెనుక నుండి ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలు అయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.వరుసగా జరిగిన ఈ ప్రమాదాలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈ రహదారిపై హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్లనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలంటే వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Leave a Reply