కట్ట మైసమ్మకు ఘనంగా బోనాల సమర్పణ….

కట్ట మైసమ్మకు ఘనంగా బోనాల సమర్పణ….

​మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ ప్రిన్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు కట్టపై వెలసిన కట్ట మైసమ్మ అమ్మవారి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​ఈ సందర్భంగా మేడ్చల్ ముదిరాజ్ సంఘం సభ్యులు రాఘవేందర్ గౌడ్‌ను ఘనంగా శాలువాతో సత్కరించి, ఆలయానికి సాదరంగా ఆహ్వానించారు.

భక్తుల కోరికలను తీర్చే తల్లిగా కట్ట మైసమ్మను కొలుస్తామని, ఇలాంటి సంప్రదాయ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు సాకర బోయిన వెంకటేశం, శ్రీను, నర్సింగరావు, నడికొప్పు దర్శన్, రాములమ్మ, విజయ్ రావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు…