షెడ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతి..

షెడ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతి..

జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి మంగళవారం జైనూర్ మండల కేంద్రానికి పర్యటించగా ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పవర్ గూడ సర్పంచ్ తొడసం రాజేందర్, ఉప సర్పంచ్ తో కలిసి కొత్త పాతపవర్ గూడ లోని హనుమాన్ మందిర్, జంగుబాయి, భీమ్ దేవుని మందిరాలకు షెడ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు.

అదేవిధంగా జంగం గొంది పట్టర్ తదితర గ్రామాల్లో నీటి సమస్య పలు సమస్యలు నాయకులు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఆమె వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరిస్తానని నీటి సమస్యలు లేకుండా మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంపీడీవో సుధాకర్ రెడ్డికి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడి మేత విశ్వనాత్ రావు, ఆసిఫాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావు, జైనూర్ మాజీ సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, జైనూర్ ఉపసర్పంచ్ డోంగ్రే ప్రకాష్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంతియాజ్ లాల, సర్పంచ్ లు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply