‘మత్తు’ కు బానిసలు కావద్దు…!

‘మత్తు’ కు బానిసలు కావద్దు…!

మాక్లూర్, ఆంధ్రప్రభ : మత్తు పదార్థాలకు బానిసలుగా యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని నిజామాబాద్ అడిషనల్ డీసిపి బస్వారెడ్డి అన్నారు. మండల పరిధిలోని దాస్ నగర్ లో గల విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రావ్యల వాడకం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ చెడు వ్యసనాలు, ఆరోగ్యాన్ని కుటుంబ పరిస్థితులను కూడా పాడు చేస్తాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్దాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని అన్నారు. యువత నడవడికపై తల్లి దండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలి. సాటి మహిళా పట్ల విజ్ఞతతో మెలగాలని సూచించారు. ఎవరైనా చట్ట రీత్యా చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇందులొ ఏసిపి ప్రకాష్ యాదవ్, మాక్లూర్ ఎస్సై మొగులయ్య, కార్పొరేటర్ మోహన్, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply