ఉపాధి కూలీలతో ఎంపీ జన్మదిన వేడుకలు…

ఉపాధి కూలీలతో ఎంపీ జన్మదిన వేడుకలు…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం గ్రామంలో బిజెపి శ్రేణులు సోమవారం ఉపాధి హామీ కూలీలతో ఘనంగా జరుపుకున్నారు. సర్పంచ్ వాకిటి వెంకటేష్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు పండ్లు శీతల పానీయాలు పంపిణీ చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వాకిటి వెంకటేష్ మాట్లాడుతూ ఎంపీడీకే అరుణ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా నారాయణపేటలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో తమ గ్రామానికి చెందిన పలువురు యువకులురక్తదానంచేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ అధ్యక్షులు ఎం.గంగాధర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి కిరణ్ కుమార్, నాయకులు కార్యకర్తలు శంకరప్ప సోమేశ్వర్ రెడ్డి వెంకట్ రాములు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply