CJP | కాక్రోచ్ జనతా పార్టీకి భారీ రిలీఫ్
X ఖాతా పునరుద్ధరణకు హైకోర్టు ఆదేశం
CJP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో నిలిపివేసిన ఆ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది.
నీట్ పరీక్షల నేపథ్యంలో సదరు ఖాతాపై కొనసాగుతున్న ఆంక్షలపై కేంద్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. అయితే పరీక్షలు పూర్తైన తర్వాత కూడా ఖాతాను నిలిపివేయడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది.
పరీక్షల సమయంలో శాంతిభద్రతలు లేదా ఇతర కారణాలతో తీసుకున్న చర్యలను పరిస్థితులు మారిన తర్వాత కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో సీజేపీ ఎక్స్ ఖాతాను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో సీజేపీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మరో 24 నుంచి 48 గంటల్లో పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా మళ్లీ క్రియాశీలం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
