కొమ్మిడి నరసింహారెడ్డికి రెడ్డి సంఘం నేతల నివాళి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భువనగిరి మాజీ శాసనసభ్యులు కొమ్మిడి నరసింహా రెడ్డి హఠాన్మరణం పట్ల రెడ్డి సంఘం నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం వారి నివాసంలో కొమ్మిడి నరసింహారెడ్డి భౌతికకాయాన్ని రెడ్డి సంఘం ప్రతినిధులు సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకున్నారు. నరసింహారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో రెడ్డి సంఘం నాయకులు కూసుకుంట్ల రాంరెడ్డి, పాటి యాదిరెడ్డి, సామ మహిపాల్ రెడ్డి, కందకట్ల బిక్షపతి, యెన్నేపల్లి లింగారెడ్డి తదితరులు ఉన్నారు.
