Former MLA | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
Former MLA | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భువనగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
కొమ్మిడి నర్సింహారెడ్డి 1978, 1983 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున భువనగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజా సేవతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.
భూదానోద్యమానికి 300 ఎకరాల భూమిని దానం చేసి ఆయన ‘భూదానశీలి’గా పేరుపొందారు. భూమిని పేదలకు పంచాలనే ఉద్యమానికి తనవంతు సహకారం అందించారు.
ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొమ్మిడి నర్సింహారెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉంచారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
