NEWS@3:00 P.M | 7 జూలై 2026 ముఖ్యాంశాలు

CJP | కాక్రోచ్ జనతా పార్టీకి భారీ రిలీఫ్

CJP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో నిలిపివేసిన ఆ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. click here to read full news

Breaking news | ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ముప్పు

Breaking news | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు పెను ప్రమాదం తప్పింది. సిరియా అధికారిక పర్యటనలో ఉన్న ఆయన బస చేసిన హోటల్ సమీపంలో డమాస్కస్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. click here to read full news

Child Road Safety | ఈ వీడియో ప్రతి తల్లిదండ్రులు చూడాలి!

Child Road Safety |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఒక చిన్న నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి. ముఖ్యంగా చిన్నారుల విషయంలో ఒక్క క్షణం ఏమరపాటు వారు కుటుంబాలకు జీవితాంతం మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తన అధికారిక ‘X’ ఖాతాలో మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ.. చిన్నారుల రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. click here to read full news

Baby Murder | ప్రమాదం అంటూ నాటకం.. విచారణలో అసలు నిజం

Baby Murder |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బెంగళూరులో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 11 నెలల పసికందును తల్లిదండ్రులే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారి ఏడుస్తోందనే కారణంతో ఆవేశానికి లోనై ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. click here to read full news

Bhiksheshwara Temple | మోక్షాన్ని ప్రసాదించే భిక్షేశ్వరుడు–గౌతమేశ్వరుడు..

Bhiksheshwara Temple | మంథని, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా మంథని… గోదావరి తీరాన వెలసిన ప్రాచీన పుణ్యక్షేత్రం. ఒకప్పుడు వేద విద్యకు కేంద్రబిందువుగా, ఋషుల తపోభూమిగా వెలుగొందిన ఈ ప్రాంతం అనేక పురాణ, చారిత్రక విశిష్టతలను సొంతం చేసుకుంది. ‘మంత్రకూటం’, ‘మంత్రపురి’గా ప్రసిద్ధి చెందిన మంథని, నేటికీ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంటూ వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. click here to read full news

Kerala | ఇద్ద‌రు మృతి, 50మంది కోసం రెస్క్యూ ఆపరేషన్

Kerala | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో ఇవాళ భారీగా కొండచరియలు విరిగిపడటంతో ఇద్ద‌రు మృతిచెంద‌గా, పలువురు కార్మికులు మట్టిదిబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. click here to read full news

Arjuna-Ranatunga-Visits : సత్యసాయి సన్నిధిలో రణతుంగ..

( శ్రీ సత్యసాయి , ఆంధ్రప్రభ ): Arjuna-Ranatunga-Visits : శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చిరకాల భక్తుడు అర్జున రణతుంగ మంగళవారం పుట్టపర్తికి విచ్చేసి ప్రశాంతి నిలయంలో స్వామి మహాసమాధిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామి ఆశీస్సులు పొందేందుకు వచ్చిన ఆయన ఆధ్యాత్మిక వాతావరణంలో కొంతసేపు గడిపి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. click here to read full news

Chicken Prices | కొండెక్కిన చికెన్ ధర..

Chicken Prices | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులపై భారం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు చికెన్, కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరగడంతో మాంసాహార ప్రియులు కొనుగోళ్లను తగ్గించుకుంటున్నారు. పెరిగిన ముడి సరుకు వ్యయాల ప్రభావంతో హోటళ్లు, మెస్‌ల్లోనూ చికెన్ వంటకాల ధరలు పెరిగాయి. click here to read full news