Tributes| డా.బి.ఆర్.అంబేడ్కర్ కు ఘన నివాళులు
Tributes| ఘంటసాల, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఘంటసాలపాలెంలోని చిన దళితవాడలో డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి తహసీల్దార్ బి.విజయ ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బి.ఆర్అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దోనె రజని, దోనె వెంకటేశ్వరరావు, మద్దాలి వీరాస్వామి, తూము దాసు, చినదళితవాడ గ్రామస్థులు పాల్గొన్నారు. సర్పంచ్ దోనె రజని ఘంటసాలపాలెం గ్రామంలోని పెద్ద దళితవాడలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
