కొయ్యలగూడెంను సందర్శించిన ఫ్యాషన్ డిజైన్ విద్యార్థులు..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామాన్ని అర్నిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కళాశాల విద్యార్థులు శనివారం సందర్శించారు. ప్రకృతి రంగులతో చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేసే దుద్యాల శంకర్ తో కలిసి చేనేత వస్త్రాలకు రంగులు, డిజైన్లు వేసే పద్ధతిని అధ్యయనం చేశారు. పోచంపల్లి పేరుతో ఖ్యాతిగాంచిన ఇక్కత్ డిజైన్ల ప్రత్యేకతను ఆ డిజైన్లు తయారు చేసే విధానాన్ని వారు పరిశీలించారు. చేనేత కలను సంప్రదాయాన్ని, కాపాడుకోవాల్సిన అవసరాన్ని స్థానిక చేనేత కళాకారుల ద్వారా తెలుసుకున్నారు.