మృతురాలికి నివాళులర్పించిన సోదా రామకృష్ణ
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన మృతులాలి అంతిమయాత్రలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ నివాళులు అర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. పరకాల మాజీ ఎంపీపీ ఒంటేరు రామ్మూర్తి సోదరి (చెల్లి) కుమ్మరి వరమ్మ గుండెపోటుతో మరణించగా కుమ్మరి వరమ్మ పార్థివదేహానికి పరకాల కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొచ్చు జెమిని, కాంగ్రెస్ పార్టీ నాలుగవ వార్డు అధ్యక్షులు బొచ్చు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
