ప్రజా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాజగోపాల్ రెడ్డి..

  • నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలు..
  • విస్తృత పర్యటనకు సిద్ధమైన మునుగోడు ఎమ్మెల్యే

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం (జూన్ 24న‌) నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం ముందుగా హైదరాబాద్‌లోని షామీర్‌పేట ఎస్‌ఎన్‌ఆర్ పుష్పా గార్డెన్‌లో జరిగే వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం బోడుప్పల్‌లోని ఆర్‌ఎన్‌ఎస్ కాలనీలో నిర్వహించే ఉపనయన కార్యక్రమంలో పాల్గొంటారు.

తర్వాత ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి గార్డెన్స్-1లో మునుగోడు క్యాంపు కార్యాలయ సిబ్బంది కుమార్ వివాహ మహోత్సవానికి హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అనంతరం చౌటుప్పల్ మండలం లక్కారంలోని ఎస్‌ఎం‌ఆర్ నిషిక కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే మరో వివాహ వేడుకలో పాల్గొంటారు.

వివాహ కార్యక్రమాల అనంతరం చౌటుప్పల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతారు. నూతనంగా ఎంపికైన కాంగ్రెస్ పార్టీ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ఆ తర్వాత చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ ఎక్స్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన టాటా ఏఐఏ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో జరుగుతున్న నాభిశిల ప్రతిష్ఠ (బొడ్రాయి పండుగ) ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చివరిగా రెండో వార్డులో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు సమాచారం.