ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శివన్నోళ్ల శివకుమార్

ఏర్గట్ల, ఆంధ్రప్రభ ; ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు శివన్నోళ్ల శివకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే నాయకుడిగా శివకుమార్ ట్రాక్ రికార్డును పరిశీలించిన అధిష్టానం ఈ బాధ్యతలను అప్పగించింది.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శివన్నోళ్ల శివకుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు

Leave a Reply