ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి..

తొర్రూరు, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొరవి సుధాకరా చారి, టియుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధారావత్ కిషన్ నాయక్ లు కోరారు. నూతనంగా డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణమూర్తిని ఆదివారం కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలైన సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, సర్వీస్ రూల్స్ సాధన, నగదరహిత వైద్య సేవలు, మోడల్ స్కూల్స్ టీచర్ల సర్వీస్ అంశాలు, కాంట్రాక్ట్ టీచర్ల జీతాల చెల్లింపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్,జీరో వన్ జీరో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారమయ్యేలా కృషి చేయాలని డిఇఓను కోరినట్లు తెలిపారు.ఈ సందర్భంగా డిఇఓ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply