పశువ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దు…

పశువ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దు…
బిక్కనూరు, ఆంధ్రప్రభ : పశువులకు సోకే వ్యాధుల పట్ల పెంపకం దారులు నిర్లక్ష్యం చేయవద్దని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి చెప్పారు .బుధవారం మండల కేంద్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత పశువైద్య శిబిరాలను పశువుల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వేసవిలో పశువులకు సోకే వ్యాధుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దన్నారు. పశువులకు ఎలాంటి జబ్బు చేసినా వెంటనే పశు వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సర్పంచ్ బల్యాల రేఖా సుదర్శన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, మండల పశువైద్యాధికారి దేవేందర్, సిద్ధిరామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ లింబాద్రి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి పలువురు నాయకులు పాడి రైతులు ఉన్నారు.
